తెలంగాణ ఇంట‌ర్ బోర్డు కీలక ప్రకటన.. జూన్ 1 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం, అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్ విడుదల

Telangana State Board of Intermediate Education Released Academic Calendar For The Year of 2023-24,Telangana State Board of Intermediate Education,Intermediate Education Released Academic Calendar,Academic Calendar For The Year of 2023-24,Telangana State Board Intermediate Academic Calendar,Mango News,Mango News Telugu,TS Inter Academic Calendar 2023,TS Inter Annual Calendar,TS School Academic Calendar 2023,Telangana Intermediate Latest News and Updates

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంట‌ర్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల‌కు జూన్ 1 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మవుతాయ‌ని తెలిపింది. అలాగే సాధారణ సెలవులతో పాటు ముఖ్యమైన పరీక్షలు జరిగే తేదీలను వెల్లడించింది. ఈ మేరకు శనివారం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అక‌డ‌మిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. అక్టోబ‌ర్ 19 నుంచి 25వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన బోర్డు, తిరిగి 26వ తేదీన కాలేజీలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. అలాగే న‌వంబ‌ర్ 20 నుంచి 25వ తేదీ వ‌ర‌కు హాఫ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక 2024, జ‌న‌వ‌రి 13 నుంచి 16వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులను ప్ర‌క‌టించిన బోర్డు, తిరిగి 17వ తేదీన ఇంట‌ర్ క‌ళాశాల‌ల ఓపెన్ అవుతాయని వెల్లడించింది. కాగా జ‌న‌వ‌రి 22 నుంచి 29 వ‌ర‌కు ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్, ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో ప్రాక్టిక‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక మార్చి మొద‌టి వారంలో ఫైనల్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here