సిద్దిపేటలో తెలంగాణ భవన్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR Inaugurates Telangana Bhavan in Ponnala Village in Siddipet District,Cm KCR Inaugurating Telangana Bhavan,TRS Party Siddipet District Office At Ponnal,TRS,TRS Party,Telangana Rashtra Samithi,Mango News,Mango News Telugu,CM KCR inaugurating Telangana Bhavan in Ponnala Village,Telangana Bhavan,Rythu Vedika,CM KCR,KCR Siddipet Tour,Telangana,CM KCR Siddipet Tour,Inaugurations In Siddipet Visit,Siddipet,Telangana Bhavan in Ponnala Village,CM KCR Inaugurating Telangana Bhavan At Siddipet District,Harish Rao,CM KCR Inaugurating,CM KCR Harish Rao,CM KCR inaugurates Telangana Bhavan,Rythu Vedika in Siddipet

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధిపేట జిల్లా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పొన్నాలలో నిర్మించిన‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం(తెలంగాణ భవన్) ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు.

అనంతరం సిద్దిపేట అర్బన్‌ మండలంలోని మిట్టపల్లిలో కొత్తగా నిర్మించిన రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అలాగే ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్ నూతన భవనాన్ని కూడా సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మెడికల్‌ కాలేజ్ కు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కోమటిచెరువు వద్ద నెక్లస్ రోడ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఇక సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో రూ.163 కోట్లతో పేద ప్రజల కోసం గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం కేసీఆర్ నగర్ ను సీఎం ప్రారంభించారు. అక్కడి నుంచి రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ వద్దకు చేరుకొని అక్కడ రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహంను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =