మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

CM KCR, CM KCR Laid Foundation Stone for Multi Super Speciality Hospital, CM KCR lays foundation for multi-super specialty hospital, CM KCR lays foundation for multi-super specialty hospital in Warangal, Foundation stone laid for construction of Multi Super Speciality Hospital, KCR Laid Foundation Stone for Multi Super Speciality Hospital, Mango News, Multi Super Speciality Hospital, super specialty hospital in Warangal, Telangana CM KCR, Warangal

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు​ జూన్ 21, సోమవారం నాడు వరంగల్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా హనుమకొండ‌లోని ఏక‌శిలా పార్కులో ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి సీఎం కేసీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం వ‌రంగ‌ల్ లో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయ‌ణ‌రావు హెల్త్ యూనివర్సిటీ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అలాగే యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్ర‌హాన్ని కూడా సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు.

ఇక వరంగల్‌ కేంద్ర కారాగార స్థలంలో 24 అంతస్తుల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం సకల హంగులు, బహుళ అంతస్తులతో అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ఒకే చోట నిర్మితమైన వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా కొత్త కలెక్టరేట్ భవనాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్య‌క్ర‌మాల్లో సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్‌, వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణి, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =