నేటి నుంచే ధరణి పోర్టల్, మూడుచింత‌లప‌ల్లిలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR Inaugurate Dharani Portal, CM KCR will Inaugurate Dharani Portal, CM KCR will Inaugurate Dharani Portal Today, dharani portal, Dharani Portal Inauguration, Dharani Portal Inauguration At Muduchintalapalli, Dharani Portal Latest News, Dharani Portal Launch, Medchal District, Muduchintalapalli, Muduchintalapalli Village, Muduchintalapalli Village of Medchal District

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపొందించిన ధరణి పోర్టల్ అక్టోబర్ 29, గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మేడ్చ‌ల్-మల్కాజ్ గిరి జిల్లాలోని మూడుచింత‌లప‌ల్లి గ్రామంలో ధరణి పోర్ట‌ల్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై తహసీల్దారు కార్యాలయంలోనే వ్యవసాయ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల జరిగేలా ఏర్పాటు చేసి, ఈ విధానం పూర్తిగా ఆన్‌లైన్ లోనే జరిగేలా రూపకల్పన చేశారు. మరోవైపు ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చ‌ట్టంమైన భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల చ‌ట్టం-2020 అక్టోబర్ 29 నుంచి అమ‌ల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈమేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు జీవో విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + ten =