తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ రైతుల తరపున కాంగ్రెస్ కొట్లాడుతుంది: రాహుల్ గాంధీ

Congress Leader Rahul Gandhi Tweets On Paddy Procurement Issue in Telangana State, Congress Leader Rahul Gandhi Tweets On Paddy Procurement Issue in Telangana, Paddy Procurement Issue in Telangana State, Rahul Gandhi Tweets On Paddy Procurement Issue in Telangana, Congress Leader Rahul Gandhi, Congress Leader, Rahul Gandhi, Rahul Gandhi Tweet, Congress Leader Rahul Gandhi Tweeted In Telugu On Telangana Paddy Procurement Issue, Congress Leader Rahul Gandhi Tweeted, Paddy Procurement Issue, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement, Telangana Paddy Procurement Latest News, Telangana Paddy Procurement Latest Updates, Telangana Paddy Procurement Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గత కొన్ని రోజులుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఏ వరి ధాన్యం అందుబాటులో ఉందో దాన్ని కేంద్రం సేకరించాలని, యాసంగిలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఇటీవల మరోమారు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ‌ కూడా రాశారు. అలాగే ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు బృందం పలుమార్లు భేటీ అయి చర్చించారు. ధాన్యం కొనుకోళ్లపై కేంద్రాన్ని నిలదీసేలా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దమవుతుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరిపై రాహుల్ గాంధీ మండిపడుతూ ట్వీట్ చేశారు. “తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది” అని రాహుల్ గాంధీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 11 =