తెలంగాణలో రాష్ట్రంలో మరో 1296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 19, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 45,076 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 12,519 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 557, వరంగల్ అర్బన్ లో 117, రంగారెడ్డి లో 111, మేడ్చల్ లో 87, కామారెడ్డిలో 67, వరంగల్ రూరల్ లో 41, మెదక్ లో 29, పెద్దపల్లిలో 29, సంగారెడ్డిలో 28, కరీంనగర్ లో 27, నల్గొండ లో 26, నిజామాబాద్ లో 24, మహబూబాబాద్ లో 21, రాజన్న సిరిసిల్ల లో 19, సూర్యాపేటలో 16, ఆదిలాబాద్ లో 15, యాదాద్రి భువనగిరిలో 15, నాగర్ కర్నూల్ లో 13, జగిత్యాలలో 11, సిద్దిపేటలో 10 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 19, సాయంత్రం 5 గంటల వరకు) :
నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 2,65,219
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 45,076
జూలై 19 న నమోదైన కేసులు : 1296
జూలై 19 న నమోదైన మరణాలు : 6
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 32,438
యాక్టీవ్ కేసులు : 12,224
మొత్తం మరణాల సంఖ్య : 415
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu