కేంద్రం కీలక నిర్ణయం, 12-14 ఏళ్ల పిల్లలకు మార్చి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ

COVID-19 Vaccination for 12-14 Years Age Group to Start from March 16th, COVID-19 Vaccination for 12-14 Years Age, COVID-19 Vaccination for 12-14 Years Age Group from March 16th, 12-14 Years Age Group, 12-14 Years Age Group COVID-19 Vaccination, Corona Vaccination Drive, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు (2008, 2009 మరియు 2010లో జన్మించిన వారు) మార్చి 16, 2022 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించబడుతుందని సోమవారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 12-14 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ లిమిటెడ్ రూపొందించిన “కోర్బెవాక్స్‌” కోవిడ్ వ్యాక్సిన్ ను అందించనున్నట్టు తెలిపారు.

అలాగే జనవరి 10 నుంచి 60 ఏళ్లు వయసు పైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికీ మాత్రమే ప్రికాషన్ డోస్ వేస్తుండగా, ఇకపై కోమార్బిడిటీస్ తో సంబంధం లేకుండా 60 ఏళ్లు వయసు పైబడిన వారందరికీ మార్చి 16 నుంచి ప్రికాషన్ డోస్ అందించనున్నట్టు ప్రకటించారు. 60 ఏళ్లు పైబడినవారు, 12-14 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఆయా కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =