అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించడంపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

CS Santhi Kumari held Meeting with Collectors on Crop Loss Assistance to Farmers due to Untimely Rains,CS Santhi Kumari held Meeting with Collectors,Crop Loss Assistance to Farmers,CS Santhi Kumari on Untimely Rains,CS Santhi Kumari on Crop Loss Assistance,Mango News,Mango News Telugu,CS Santhi Kumari,CS Santhi Kumari Meeting Today,CM KCR Orders On Financial Assistance,KCR announces Rs 10000 per acre,Department of Agriculture,Compensation to Farmers,CS Santhi Kumari Latest News,CS Santhi Kumari Latest Updates

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్షించి, తదుపరి మిగత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, రెవెన్యూ (డీఎం) కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు హాజరయ్యారు.

దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన మేరకు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఏఈవోలతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. విమర్శలకు ఆస్కారం లేకుండా ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో పంట నష్టం అంచనా వేయాలని సీఎస్ అన్నారు. బృందాలు పొలాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని అన్నారు. పోడు భూముల పురోగతిని కూడా సీఎస్ శాంతి కుమారి సమీక్షించారు. పోడు భూములకు సంబంధించి పాసుపుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జొంగ్తు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 19 =