50వ రోజుకు చేరుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర

TDP National General Secretary Nara Lokesh Yuvagalam Padayatra Reached To 50-Day Milestone Today,TDP National General Secretary Nara Lokesh,Yuvagalam Padayatra Reached To 50-Day Milestone Today,Nara Lokesh Yuvagalam Padayatra,Mango News,Mango News Telugu,Nara Lokeshs Yuva Galam,Andhra Pradesh Nara Lokeshs Padayatra,Nara Lokesh Yuvagalam Padayatra Latest News,Nara Lokesh Yuvagalam Padayatra Latest Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరో ఈరోజు మరో సంరంభం చేసుకోనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన 4,000 కిలోమీటర్ల యువ గళం పాదయాత్ర శనివారం (మార్చి 25, 2023) నాటికి 50వ రోజు మైలురాయిని చేరుకుంది. జనవరి 27న చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభమైన లోకేష్ యాత్ర ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాకు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు లోకేష్ 625 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా మూడు రోజుల విరామం ప్రకటించిన నారా లోకేష్ నేడు పాదయాత్రను మళ్ళీ పున:ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు సత్యసాయి జిల్లాలోని ఓబుళదేవర చెరువు మండలం ఒనుకువారిపల్లి నుంచి యాత్రను మొదలుపెట్టారు.

ఈరోజు పాదయాత్ర రామయ్యపేట వద్ద ముగియనుండగా.. రాత్రికి రామయ్యపేట విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు. ఇక నేటి పాదయాత్రలో భాగంగా నారా లోకేష్.. గాజులకుంటపల్లిలో రైతులతో సమావేశం కానున్నారు. అలాగే వడ్డేపల్లిలో ఎస్టీ సామాజికవర్గ ప్రముఖులతో మరియు ఒడిసి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో మైనారిటీలతో భేటీ అవనున్నారు. ఈ క్రమంలో ఒడిసి రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద బహిరంగ సభలో స్థానికులనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం మొహమ్మదాబాద్ క్రాస్ వద్ద అమడగూరు స్థానికులు, సత్యసాయి వర్కర్లతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు లోకేష్ పాదయాత్ర వివరాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here