మల్లారెడ్డి సంచలన ప్రకటన

Mallareddys, Sensational Announcement, Mallareddy, Medchal MLA Mallareddy, BRS, Malla Reddy Speech, Labour Minister, KCR, Telangana News Today,Telangana News Today In English,Telangana Latest News And Updates,Telangana Politics, Mango News Telugu, Mango News, BRS Party, Medchal
Mallareddy, Medchal MLA Mallareddy, BRS, Telangana Politics

మల్లారెడ్డి.. ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. పూలమ్మిన, పాలమ్మిన అంటూ మాస్ డైలాగ్ చెప్పి సోషల్ మీడియా స్టార్‌గా మారారు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయారు. అటు రాజకీయాల్లో మల్లారెడ్డి రఫ్ఫాడిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులను ఏకిపారేయడంలో మల్లారెడ్డి స్టైలే వేరు. బీఆర్ఎస్‌లో ఫైర్‌ బ్రాండ్ అనే పేరు కూడా మల్లారెడ్డికి ఉంది. ఇదిలా ఉండగా తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు మల్లారెడ్డి. ఇక ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.

అవును.. నిజంగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మల్లారెడ్డి ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల ముందు మల్లారెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికలకు మందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున మేడ్చల్ నుంచి బరిలోకి అత్యధిక మెజార్టీతో మల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా మల్లారెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ మేడ్చల్ టికెట్  కట్టబెట్టింది. ఈసారి కూడా మల్లారెడ్డి మేడ్చల్ నుంచి గెలుపొంది.. రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ హైకమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకే మల్కాజ్‌గిరి టికెట్ ఇచ్చింది. కానీ తన కొడుక్కి టికెట్ ఇవ్వలేదని.. హన్మంతరావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ టికెట్‌ను బీఆర్ఎస్ మర్రి రాజశేఖర్ రెడ్డికి కేటాయించింది.

ఇక కొద్దిరోజుల క్రితమే మల్లారెడ్డి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశిస్తే మల్కాజ్‌గిరి స్థానం నుంచి బరిలోకి దిగుతానని వెల్లడించారు. ఇంతలోనే తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని మల్లారెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు లేదని.. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నానన్న మల్లారెడ్డి.. రాబోయే అయిదేళ్లలో మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తానని చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + thirteen =