ఆయిల్ పామ్ విత్తనాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించండి – సీఎస్ సోమేశ్ కుమార్

CS seeks reduction of customs duty on oil palm seed import, CS Somesh Kumar, CS Somesh Kumar Meets Union Agriculture Minister, CS Somesh Kumar Meets Union Agriculture Minister Narendra Singh Tomar at IIMR Today, Cultivation of Oil Palm, Mango News, Oil Palm, oil palm seed import, Reduce customs on oil palm sprouts, Somesh Kumar, Telangana Chief Secretary, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar calls on Union Agriculture Minister, Union Agriculture Minister Narendra Singh Tomar

రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను చేపడుతున్నందున, ఈ ప్లాంటేషన్ కు విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్ పామ్ విత్తనాలకు కస్టమ్స్ సుంకాన్ని తగ్గించేలా తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజేంద్రనగర్ లోని భారత తృణధాన్యాల సంస్థలో ఏర్పాటు చేసిన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ అగర్వాల్ తో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తలపెట్టిన 20 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాలు లభించేలా చూడాలని సీఎస్ కోరారు.

ఈ సందర్భంగా భారత తృణధాన్యాల సంస్థలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను సీఎస్ సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చేపట్టిన పలు కార్యక్రమాలను, 20 లక్షల ఎకరాల్లో చేపడుతున్న ఆయిల్ పామ్ ప్లాంటేషన్ తదితర అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఐ.ఐ.ఎం.ఆర్. లు ఏర్పాటు చేసిన న్యూట్రీ-సీరియల్ సెంటర్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్, గ్లాస్ హౌస్ రీసర్చ్ సౌకర్యాల సంస్థ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో కలసి సీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి తోమర్ తో పాటు సోమేశ్ కుమార్ సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =