ప్రజాభవన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించిన ప్రభుత్వం

Deputy CM Bhatti Vikramarka Was Assigned to Praja Bhavan by the Government,Deputy CM Bhatti Vikramarka,Bhatti Vikramarka Was Assigned to Praja Bhavan,Praja Bhavan by the Government,Mango News,Mango News Telugu,Praja bhavan, Mallu batti vikramarka, CM Revanth reddy,Mahatma Jyothiba Phule Praja Bhavan, congress,Deputy CM Bhatti Vikramarka Latest News,Deputy CM Bhatti Vikramarka Latest Updates,Deputy CM Bhatti Vikramarka Live News,Telangana Praja Bhavan Latest News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Praja bhavan, Mallu batti vikramarka, CM Revanth reddy, congress

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెను తొలగించేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ప్రగతి భవన్ గేట్లు కూల్చేస్తామని.. ప్రజలకు పాలకులకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.  చెప్పినట్లుగానే.. అధికారంలోకి రాగనే కంచెను తొలగించేశారు.  అంతేకాకుండా ప్రగతి భవన్ పేరును మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా మార్చేశారు. అప్పటి నుంచి ప్రజాభవన్‌లో ప్రజా వాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వారానికి రెండు రోజుల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆ ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్కకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి జీవో నెం. 1638 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఆ భవంతిని వెంటనే భట్టి విక్రమార్కకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా గురువారం ప్రగతి భవన్‌కు షిఫ్ట్ అవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇకపోతే ప్రజా భవన్‌కు భట్టి విక్రమార్కకు కేటాయించడంతో..  సీఎం క్యాంపు కార్యాలయం కోసం అధికారులు ప్రత్యామ్నాయ భవనం కోసం వెతుకుతున్నారు. ఈక్రమంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనంలో సీఎం క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సకల సదుపాయాలు, భద్రతాపరంగా అనుకూలంగా ఉండడంతో పాటు.. పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండడంతో దీని పేరును అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి సూచించారట. త్వరలో దీనిపై రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − ten =