లోక్‌సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు

Bystanders burst into the Lok Sabha and released tear gas,Bystanders burst,burst into the Lok Sabha,released tear gas,Loksabha, Parliament, Tear gas, Arrest, speaker, Public gallery,Mango News,Mango News Telugu,Carrying Cans That Emitted Yellow Smoke,Terrifying security breach in Lok Sabha,Lok Sabha Security Breach,Bystanders Pick Up Canister,Lok Sabha Latest News,Lok Sabha Latest Updates,Lok Sabha Live News,Lok Sabha tear gas Latest News
Loksabha, Parliament, Tear gas, Arrest, speaker, Public gallery

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. దేశాన్ని కుదిపేస్తోంది. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండగా.. లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించారు. ఓ ఆగంతకుడు పబ్లిక్ గ్యాలరీలో నుంచి లోక్‌సభలోకి దూకి గందరగోళం సృష్టించాడు. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నినాదాలు చేశాడు. ఆ వెంటనే మరో ఆగంతకుడు పబ్లిక్ గ్యాలరీ నుంచి టియర్ గ్యాస్‌ను లోక్‌సభలోకి వదిలాడు. దీంతో లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ఎంపీలు, సెక్యూరిటీ సిబ్బంది చుట్టుముట్టి ఆగంతకులను పట్టుకున్నారు.

సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలో పోలీసులు, సిబ్బందితో కలిసి మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు సభలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఆ తర్వాత జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా.. ఆగంతకులు ఈ ఘటనకు పాల్పడ్డారు. తానా షాషీ బంద్ కరో.. భారత్ మాతాకీ జై అంటూ నిందుతులు లోక్‌సభలో నినాదాలు చేశారు. ఈ ఘటనతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను వాయిదా వేశారు.

అదే సమయంలో పార్లమెంట్ బయట కూడా మరో ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. పసుపు, ఎరుపు రంగులతో కూడిన టియర్ గ్యాస్‌లను వదిలి నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరిని కూడా అదుపుతోకి తీసుకున్నారు. ఘటనకు పాల్పడిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఇక నిందితులు నీలం కౌర్, అమోల్ షిండే, సాగర్ శర్మ, మనో రంజన్‌గా పోలీసులు గుర్తించారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ పాస్‌లతో ఆగంతకులు పార్లమెంట్‌లోకి వచ్చినట్లు వచ్చారని వెల్లడించారు.

ఇకపోతే 2001లో ఇదే రోజున లష్కరే తొయిబా ఉగ్రవాదులు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబడ్డారు. ఐదుగురు ఉగ్రవాదులు సభ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈసమయంలో కాల్పులు చోటుచేసుకొని 9 మంది పార్లమెంట్ సిబ్బంది అమరులయ్యారు. ఆ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఉగ్రవాదులపై ఎదురు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటన జరిగి 22 ఏళ్ల తర్వాత.. సరిగ్గా అదే రోజున కాల్పులు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 12 =