జీహెచ్‌ఎంసీలో నేరేడ్‌మెట్ గెలుపుతో టీఆర్ఎస్ ఖాతాలో 56 డివిజన్లు

GHMC Elections Results: TRS Party Candidate Won Neredmet Division By 782 Votes,TRS Party Candidate Won Neredmet,TRS,GHMC Elections Results Live Updates,GHMC Results Updates,GHMC Elections 2020 Results Updates,GHMC Elections 2020 Results,GHMC Results,GHMC Elections Results,#GHMCElections2020Results,GHMC Elections 2020 Results Latest News,GHMC,GHMC Elections 2020 Results Live News,TRS Party,GHMC Elections Results Latest Updates,GHMC Elections 2020 Results Latest Reports,2020 GHMC Elections Results,GHMC Elections 2020 Results Live Updates,Greater Hyderabad Result 2020 Live Updates,Neredmet Division,Neredmet,TRS Party Won Neredmet Division By 782 Votes

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో భాగంగా నేరెడ్‌మెట్ డివిజ‌న్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రోజున మొత్తం 150 డివిజన్లకు గానూ 149 డివిజన్ల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. ఇక నేరేడ్‌మెట్ డివిజన్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా వేరే ముద్రతో నమోదైన ఓట్లు ఎక్కువుగా ఉండడంతో అక్కడ పలితాన్ని నిలిపేశారు. కాగా స్వస్తిక్‌తో పాటు ఇతర ముద్రతో ఉ‍న్న ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ తాజాగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో బుధవారం ఉద‌యం 8 గంట‌ల‌కు సైనిక్‌పురిలోని భ‌వ‌న్స్ వివేకానంద కాలేజీలో నేరేడ్‌మెట్ డివిజ‌న్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు.

నేరెడ్‌మెట్ డివిజ‌న్ లో మొత్తం 25,176 ఓట్లు పోల్ అవ్వగా 24,632 ఓట్లను డిసెంబర్ 4 వ తేదీనే లెక్కించారు. అందులో 504 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి మీనా ఉపేందర్ రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. ఇక ఈ రోజు స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇత‌ర గుర్తులున్న 544 ఓట్లను లెక్కించిన అనంతరం మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన‌ట్లుగా ఎన్నిక‌ల అధికారులు ప్రకటించారు. నేరేడ్‌మెట్ డివిజన్ గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ జీహెచ్‌ఎంసీలో మొత్తం 56 డివిజన్స్ గెలుచుకున్నట్టు అయింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ (150/150):

  1. టిఆర్ఎస్ – 56
  2. బీజేపీ – 48
  3. ఎంఐఎం – 44
  4. కాంగ్రెస్ – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + three =