ఎన్నికల జోరు..హెలికాప్టర్ల హోరు

Rich campaign in Telangana,campaign in Telangana,Rich campaign,campaign in Telangana, elections, helicopters, , TRS, Congress, Bjp, Assemblly Elections, Modi, Bandi Sanjay, Kishan Reddy, Harish Rao,Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party,Mango News,Mango News Telugu,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Rich campaign Latest News,Telangana Rich campaign Latest Updates
campaign in Telangana, elections, helicopters, , TRS, Congress, Bjp, Assemblly Elections, Modi, Bandi Sanjay, Kishan Reddy, Harish Rao

ఒకప్పుడు ఆకాశంలో హెలికాప్టర్ వెళుతున్నట్లు కనిపిస్తే… ఏ ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో వెళుతున్నారని అనుకునేవాళ్లు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో హెలీక్యాప్టర్లలో పీఎం,  సీఎం, లేదా ఆ  స్థాయి వ్యక్తులు, జాతీయ పార్టీలకు చెందిన మెయిన్ లీడర్స్ మాత్రమే ప్రయాణించేవాళ్లు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నేతలూ హలికాప్టర్‌లో చక్కర్లు కొట్టేస్తున్నారు.

 

కారు ప్రయాణం అంత ఈజీగా హెలికాప్టర్లలో జర్నీ చేసేస్తున్నారు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మెయిన్  లీడర్స్ అంతా తమ ఎన్నికల ప్రచారానికి వీటిని వినియోగిస్తున్నారు. ఇలా  ప్రయాణిస్తూనే రోజుకు 3 నుంచి 5 ప్రాంతాలను చుట్టేస్తూ పార్టీ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.

 

సాధారణంగా ఏ పార్టీలో అయినా ఓటర్ల దగ్గరను ప్రభావితం చేయగల నాయకులు,  చరిష్మా ఉన్న నేతలు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. దీంతో వీరిని ఉపయోగించుకుని ఓటర్లను  ఆకర్షించడానికి పార్టీ అధిష్టానం హెలికాప్టర్లకే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఉన్న తక్కువ సమయంలో వాళ్లను రోడ్డు మార్గం ద్వారా ఎక్కువ సభల్లో పాల్గొనేలా చేయడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ పెద్దలు స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారం కోసం ఒక్కో పార్టీ కనీసం రెండు చొప్పున హెలిక్యాప్టర్లను బుక్ చేసుకుని పెట్టుకుంటున్నాయి. అయితే వీటికి అయ్యే ఖర్చు అభ్యర్థుల అకౌంట్‌లలో కాకుండా పార్టీ ఖాతాలో జమ అవుతుంది.

 

 

పల్లెటూరిలో ఎప్పుడో కానీ చూసే హెలిక్యాప్టర్లు..ఇప్పుడు ఎన్నికల వల్ల తరచూ కనిపిస్తుండటంతో వాటిని చూడటానికి జనాలు ఎగబడుతున్నారు. నేతలను చూడటానికి వచ్చేవారి కంటే హెలికాప్టర్లను చూడటానికి వచ్చే వారి సంఖ్య కూడా కొన్ని చోట్ల ఎక్కువగానే ఉంటుంది.  మారుమూల ప్రాంతాల్లోనూ కూడా ఇవి ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉండటంతో.. భద్రత దృష్ట్యా రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి వీలు లేని అటవీ ప్రాంతాల దగ్గర.. హెలిక్యాప్టర్లలో వచ్చి నేతలు తమ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

 

తెలంగాణ సీఎం ,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌  ఇప్పటికే హెలికాప్టర్లలో సుడిగాలి పర్యటనలతో  రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారు. జిల్లాల వారిగా  నియోజకవర్గాలకు వెళ్లి భారీ బహిరంగ సభలకు హాజరవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ మెయిన్ లీడర్స్ అయిన  కేటీఆర్‌, హరీశ్‌రావులు కూడా హెలికాప్టర్లను వాడుతూ  తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు.

 

అలాగే అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా తన ప్రచారంలో భాగంగా హెలిక్యాప్టర్‌నే ఎక్కువగా వాడుతున్నారు.  ఆదిలాబాద్‌, ఉట్నూరు, బెల్లంపల్లిల్లో రేవంత్ ఇప్పటి వరకు హెలికాప్టర్లలోనే ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్‌ వినియోగిస్తుండగా.. ఆ పార్టీ ముఖ్యనేతలు  రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు మాత్రం తెలంగాణ ఎప్పుడు వచ్చినా కారులోనే ప్రయాణిస్తున్నారు.

 

మరోవైపు బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కూడా హెలికాప్టర్ల ద్వారానే  తమ ప్రచారాన్ని  సాగిస్తున్నారు. బండి సంజయ్‌ ఇప్పటికే జన్నారం, సిర్పూరులో హెలికాప్టర్ ద్వారానే  ఎన్నికల సభకు హాజరయ్యారు.అలాగే  ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా తో పాటు వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల పర్యటనలో హెలికాప్టర్లనే వినియోగించారు.. అలాగే రాబోయే రోజుల్లో కూడా వినియోగిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eleven =