రేపు నల్లమల అడవుల్లో గవర్నర్ తమిళిసై పర్యటన, అప్పాపూర్ గ్రామంలోని చెంచులతో సమావేశం

Governor Tamilisai to Interact with the Chenchus of Appapur Tribal Habitations Tomorrow, Governor Tamilisai to Interact with the Chenchus of Appapur Tribal Habitations, Chenchus of Appapur Tribal Habitations, Governor Tamilisai to Interact with the Chenchus, Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan to Interact with the Chenchus of Appapur Tribal Habitations, Appapur Tribal Habitations, Appapur Tribal, Tamilisai Soundararajan, Governor of Telangana, Tamilisai Soundararajan Governor of Telangana, Appapur Tribal, Appapur Tribal Latest News, Appapur Tribal Latest Updates, Mango News, Mango News Telugu,

నాగర్ కర్నూల్ జిల్లాలోని అప్పాపూర్ గిరిజన ప్రాంతానికి చెందిన చెంచులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం సమావేశం కానున్నారు. నల్లమల అడవుల్లో పర్యటన సందర్భంగా గవర్నర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ‘పౌష్టికాహార సంబంధిత అంశాలు, ఎంపిక చేసిన గ్రామాల్లోని పీటీజీల సంపూర్ణ అభివృద్ధి’ ఇతివృత్తంతో గవర్నర్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇతివృత్తంతో 6 గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా అప్పాపూర్, బౌరాపూర్ అనే రెండు చెంచు గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది.

ఈ పర్యటనలో భాగంగా నల్లమల అడవుల్లోని వివిధ సంస్థలు, హెల్త్ సబ్ సెంటర్లు, కుట్టుమిషన్ శిక్షణా తరగతుల కేంద్రం, ఆశ్రమ పాఠశాల తదితర సంస్థలను గవర్నర్ సందర్శించనున్నారు. వీటి సందర్శన అనంతరం ఆ రెండు గ్రామాల చెంచులతో గవర్నర్ సమావేశమవుతారు. అప్పాపూర్, బౌరాపూర్ గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వారికి ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు. దీంతో పాటుగా ఈ రెండు గ్రామాల సర్పంచ్ లకు ద్విచక్రవాహన అంబులెన్స్ లను కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పంపిణీ చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =