తెలంగాణ గవర్నర్‌ గా రెండేళ్లు పూర్తిచేసుకున్న తమిళిసై సౌందరరాజన్‌, పుస్తకం ఆవిష్కరణ

Governor Tamilisai Soundararajan, Mango News, Tamilisai Soundararajan, Tamilisai Soundararajan Completes 2 Years As Telangana Governor, Tamilisai Soundararajan Completes 2 Years Term As Telangana Governor, Tamilisai Soundararajan Interacted with Media, Tamilisai Soundararajan Interacted with Media on the Occasion of Entering into Third Year as Governor, Tamilisai Soundararajan Press Meet, Tamilisai Soundararajan Third Year as Governor, Telangana Governor Tamilisai Soundararajan

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ గా తమిళిసై సౌందరరాజన్‌ రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్ గా మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో బుధవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో మీడియా ప్రముఖులతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ గా రెండో సంవత్సరం చేపట్టిన కార్యక్రమాలు, హాజరైన సభలు, సమావేశాల సమాహారంగా తీర్చిదిద్దిన ప్రత్యేక పుస్తకాన్ని (One Among and Amongst the People) జర్నలిస్ట్ ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. గొప్ప ఆప్యాయతను, అభిమానాన్ని, ప్రేమను చూపుతున్న మంచి మనసున్న తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం రాజ్‌భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రెండేళ్లు గవర్నర్‌గా పూర్తి చేసుకున్న ఈ విజయాన్ని ఇటీవల చనిపోయిన తన తల్లికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఆరు నెలలుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని, ఇందుకు రాజ్ భవన్ సిబ్బంది సహకారం ఉందని తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌గా చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మీడియా ఎంతగానో సహకరించిందని, అందుకే తాము ప్రజలకు మరింత చేరువ కాగలినట్లు వెల్లడించారు. మరోవైపు హుజురాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గవర్నర్‌ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక సేవ చేసే వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలని సూచించారు. కౌశిక్‌రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాలని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 2 =