సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

BJP MLA Etela Rajender Sensational Comments on Nationwide Tour of CM KCR, MLA Etela Rajender Sensational Comments on Nationwide Tour of CM KCR, MLA Etela Rajender Comments on Nationwide Tour of CM KCR, MLA Etela Rajender Intresting Comments on Nationwide Tour of CM KCR, Nationwide Tour of CM KCR, Telangana CM KCR to Start Country Wide Tour, CM KCR to Country Wide Tour, CM KCR to Country Wide Tour News, CM KCR to Country Wide Tour Latest News, CM KCR to Country Wide Tour Latest Updates, CM KCR to Country Wide Tour Live Updates, KCR on nation-wide tour from today, Telangana CM KCR To Begin Nationwide Tour, CM KCR, KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఆర్ఎస్ మాజీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించనున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. సీఎం కేసీఆర్‌కు పాలన చేతకాకే ఇతర రాష్ట్రాలలో పర్యటించటానికి వెళ్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు టైముకి ఇవ్వడం లేదని, రెండు మూడు నెలలకు ఒకసారి పెన్షన్లు ఇస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రతిదానిపై అదనపు చార్జీలు వాసులు చేస్తున్నారని.. భూముల రిజస్ట్రేషన్, కరెంటు, లిక్కర్,  బస్సు ఛార్జీలు ఇలా అన్నిటిని పెంచి, సంవత్సరానికి రూ. 25 వేల కోట్ల భారం ప్రజల మీద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలను వదిలిపెట్టి పక్క రాష్ట్రాలను ఉద్ధరిస్తానని బయలుదేరిన కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. కాగా సీఎం కేసీఆర్.. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీల నాయకులను, వివిధ భాషలకు చెందిన మీడియా రంగాల అధిపతులను కలవనున్నారు. దేశంకోసం ప్రాణాలర్పించిన సైనిక కుటుంబాలకు ఆర్ధిక చేయూత అందించనున్నారు. అలాగే రైతుల హక్కుల కోసం జాతీయ రైతు ఉద్యమంలో పోరాడి, కేంద్రంపై అలుపెరగని పోరాటం చేసి అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి పరామర్శించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 13 =