తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన, రాష్ట్రంలో కొత్తగా 32 కొత్త జిల్లాల కోర్టులు.. ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌

Hyderabad CJI NV Ramana and CM KCR Launches 32 New Judicial Districts From High Court of Telangana, CJI NV Ramana And Telangana CM KCR To Launch 32 Judicial Districts On June 2, Telangana CM KCR To Launch 32 Judicial Districts On June 2, CJI NV Ramana To Launch 32 Judicial Districts On June 2, 32 Judicial Districts, CJI NV Ramana And Telangana CM KCR, CJI NV Ramana, NV Ramana, Chief Justice of India, Telangana CM KCR, Telangana State Formation Day, State Formation Day, Telangana Day, Telangana State Formation Day News, Telangana State Formation Day Latest News, Telangana State Formation Day Latest Updates, Telangana State Formation Day Live Updates, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన జిల్లాల కోర్టుల‌ను ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం హైకోర్టు ప్రాంగ‌ణం నుంచి 32 కొత్త జిల్లాల కోర్టుల‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కొత్త జ్యుడీషియల్ జిల్లాలకు 32 మంది సెషన్ జడ్జిలు ఉంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ చంద్రశర్మ, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రావతరణ రోజున ఈ కొత్త జిల్లాల కోర్టులు ప్రారంభించుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. జ్యుడిషీయ‌ల్ డిపార్ట్‌మెంట్‌కు ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో స‌హ‌కారం అందించేందుకు సిద్ధమని తెలిపారు. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ ఇదే హైకోర్టులో ప‌ని చేశారని, ఆయన చొరవచూపి కేంద్రంతో మాట్లాడి మ‌న హైకోర్టు జ‌డ్జిల సంఖ్య‌ను పెంచారని తెలిపారు. సెష‌న్స్ కోర్టుల‌కు వెళ్లేందుకు ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డేవారని, ఈ క్రమంలో రాష్ట్రంలో జిల్లా కోర్టులు కావాల‌ని కోరిన వెంట‌నే ర‌మ‌ణ అంగీక‌రించారని సీఎం గుర్తుచేసుకున్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప‌రిపాల‌నలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తెచ్చామని, దీనిలో భాగంగానే కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేశామని, తద్వారా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ జరిగి స‌త్ఫ‌లితాల‌ను సాధిస్తున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన ఈ కోర్టుల‌కు కావాల్సిన సిబ్బందిని త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సిటి సివిల్ కోర్టులు, రంగారెడ్డి కోర్టుల పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని, దీనిపై ఆయా కోర్టుల వారు ప్ర‌తిపాద‌న‌లు పంపిస్తే ప్ర‌భుత్వం వెంటనే తగిన చర్యలు చేపడుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =