ఆధార్ ప్రక్రియ వలన కేంద్రానికి రూ. 2 లక్షల కోట్లు ఆదా – నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్

NITI Aayog CEO Amitabh Kant Announces Aadhaar Saved Over Rs 2 Lakh Crore by Eliminating Fake Identities, NITI Aayog CEO Announces Aadhaar Saved Over Rs 2 Lakh Crore by Eliminating Fake Identities, CEO Amitabh Kant Announces Aadhaar Saved Over Rs 2 Lakh Crore by Eliminating Fake Identities, Amitabh Kant Announces Aadhaar Saved Over Rs 2 Lakh Crore by Eliminating Fake Identities, Aadhaar Saved Over Rs 2 Lakh Crore by Eliminating Fake Identities, Fake Identities, 2 Lakh Crore, Aadhaar, NITI Aayog CEO Amitabh Kant, NITI Aayog CEO, CEO Amitabh Kant, Amitabh Kant, Aadhaar Card, Aadhaar News, Aadhaar Latest News, Aadhaar Latest Updates, Aadhaar Live Updates, Mango News, Mango News Telugu,

నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ కాంత్ ఆధార్‌ను ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు కార్యక్రమాలలో ఒకటిగా అభివర్ణించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా ఆదా అయినట్లు ఆయన ప్రకటించారు. డూప్లికేట్ గుర్తింపులను తొలగించడం ద్వారా ఇది సాధ్యమైనట్లు తెలిపారు. ఆధార్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పునాదిగా మారింది, పథకాల అమలులో ఎటువంటి మధ్యవర్తుల జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండటం మూలాన అధిక మొత్తంలో ప్రభుత్వానికి డబ్బు ఆదా చేయడంలో ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 315 కేంద్ర పథకాలతో పాటు 500 రాష్ట్ర పథకాల సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందజేసేందుకు ఆధార్‌ను వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇతర దేశాలలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు గల అవకాశాలపై ప్రపంచ బ్యాంక్ మరియు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మన దగ్గర ఆధార్ కార్డులు దుర్వినియోగం అవుతున్న సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉంటున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా కొన్ని మార్గదర్శకాలను కూడా ప్రవేశపెట్టింది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆధార్ ఇవ్వాల్సి వస్తే జాగ్రత్త వహించాలని సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − thirteen =