క‌దం తొక్కుతున్న కాషాయం

Hyderabad Jubilee Hills Politics,Hyderabad Jubilee Hills,Jubilee Hills Politics,deepak reddy, jubileehills, bjp, telangana assembly elections,Mango News,Mango News Telugu,Assembly election results 2023,Telangana polls,TS Election 2023,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Jubilee Hills Politics Latest News,Jubilee Hills Politics Latest Updates,Jubilee Hills Politics Live News
deepak reddy, jubileehills, bjp, telangana assembly elections

తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ప్ర‌చారం ముగిసే గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ కొన్ని చోట్ల ఆస‌క్తిక‌ర‌ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్ర‌ధాన పార్టీలు వేగం పెంచుతున్నాయి. త‌మ పార్టీ జెండాల‌ను రెప‌రెప‌లాడిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ ఎస్‌, రాష్ట్ర మంతా దూకుడు మీదున్న కాంగ్రెస్ కు ఇక్క‌డ బీజేపీ గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఆ పార్టీ అభ్య‌ర్థి లంకల దీపక్ రెడ్డి ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. ఆయ‌న చేస్తున్న పాదయాత్రల‌కు అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్నారు.

లంక‌ల దీప‌క్ రెడ్డి పోటీలో నిల‌బ‌డ‌డానికి ముందు నుంచే ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఉన్నారు. పాద‌యాత్రల ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకున్నారు. అందుకే ఆయ‌నకు టికెట్ క‌న్పామ్ అయ్యాక‌.. నామినేష‌న్ వేసేందుకు జ‌నం త‌ర‌లివ‌చ్చారు. ఇత‌ర పార్టీల‌కు మించి ఆయ‌న ర్యాలీలో ప్ర‌జ‌లు, బీజేపీ కార్య‌క‌ర్త‌లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక అప్ప‌టి నుంచీ లంక‌ల ప్ర‌చారంలో దూకుడు ప్ర‌దర్శిస్తూనే ఉన్నారు. ఆయ‌న రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి వంటి ప్ర‌ముఖ నేత‌ల అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి, ఇత‌ర  నేత‌లు ప్ర‌చారంలో ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్నారు. దీంతో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోల్చుకుంటే ఇక్క‌డ కాషాయ జెండా రెప‌రెప‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

దీప‌క్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత‌. స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌గ‌లిగే వ్య‌క్తి అని ఆయ‌న గుర్తింపు పొందారు. స్థానిక ఎమ్మెల్యే క‌బ్జాలు, ఇత‌ర ఆగ‌డాల‌పై గ‌తంలో ఆయ‌న ప‌లుమార్లు ఆందోళ‌న చేప‌ట్టారు.  దీప‌క్ రెడ్డి విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, 1994లో మహారాష్ట్రలో బాబ్లీ ఆయకట్టు విషయంలో తెలుగుదేశం నిర్వహించిన ధర్నాలో మొదటి లాఠీ దెబ్బ‌లు తిన్నది దీప‌క్ రెడ్డే. అతని చరిష్మా, అతని సోదర భావం, అందరితో కలిసి మెలసి అని వేళల్లో అని రాజకీయ ఒత్తిడితో కూడా అవన్నీ అధిగమించారు. గ‌తంలో తెలుగుదేశం పార్టీ నేత‌గా ఉన్న హ‌యాంలోనూ ఆయ‌న అనేక పదవుల్లో రాణించారు. 2019 లో బీజేపీ లో చేరిన దీప‌క్ రెడ్డి అప్ప‌టి నుంచీ సుశిక్ష‌త గ‌ల కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తూ వ‌స్తున్నారు. జూబ్లీహిల్స్ లో అనునిత్యం ప్రజలతో, కార్యకర్తలతో మమేకమై ఉన్నారు. దీంతో పార్టీ అధిష్ఠానం ఆయ‌న‌ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

అంద‌రినీ క‌లుపుకుంటూ దీపక్ రెడ్డి ప్ర‌చారంలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో కీల‌క నియోజకవర్గం కావ‌డంతో దీనిపై అంద‌రి చూపూ ఉంది. తాను గెలిస్తే జూబ్లీహిల్స్ కు ఏం చేస్తారో స్ప‌ష్టంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత ప్రధానమంత్రి గా గుర్తింపు పొందిన న‌రేంద్ర మోదీ ఆశయాల‌కు అనుగుణంగా న‌డుస్తాన‌ని పేర్కొంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమీషా దిశ నిర్దేశాలతో, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆశీస్సులతో తాను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న‌ట్లుగా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. తాను గెలిచాక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయడం తన ముఖ్య ఉద్దేశమని, అందుకు ప్రధానంగా ఇక్కడ నివసిస్తున్న బడుగు బలహీన వర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాన‌ని ప్ర‌చారంలో వివ‌రిస్తున్నారు. తొలి నుంచీ రక్తదానం వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్ర‌జ‌ల్లో ఉంటున్న దీప‌క్ రెడ్డి బీజేపీ అభ్య‌ర్థిగా ఉండ‌డంతో జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌చారంలో కాషాయ జెండాకు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − four =