సింగరేణిలో ఈ సారి పాగా వేసే పార్టీ అదేనా?

Is it the same party that will take place this time in Singareni,Is it the same party,That will take place this time,place this time in Singareni,Singareni,Telangana Assembly Election 2023, voters, leaders ,BRS,BJP,Congress party,Mango News,Mango News Telugu,Singareni Elections,Telangana polls,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Singareni Elections Latest News,Singareni Elections Latest Updates,Singareni Elections Live News
Singareni,Telangana Assembly Election 2023, voters, leaders ,BRS,BJP,Congress party,

ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న సింగరేణిలో ఉంటున్న కార్మికవర్గం .. ప్రతీ ఎన్నికల్లోనూ  విలక్షణమైన తీర్పునే ఇస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఏ పార్టీ హవా ఎలా ఉన్నా కూడా  కార్మిక క్షేత్రాలకు వచ్చేసరికి  కాస్త  భిన్నంగానే ఉంటోంది. అంతెందుకు 2018 అసెంబ్లీ ఎన్నికలలో.. తెలంగాణ అంతా కారు జోరు కొనసాగితే కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో మాత్రం పూర్తి విరుద్ధమైన తీర్పు వచ్చింది.ఆ తీర్పు చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు.

2018 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ కోల్‌బెల్ట్‌ మెజార్టీ సీట్లను హస్తగతం చేసుకుంది. దీంతో ఈ సారి తీర్పు ఎలా ఉంటుందో.. ఏ పార్టీకి పట్టం కడతారోనని జోరుగా చర్చ సాగుతోంది. కార్మికుల అండ ఏ జెండాకుంటుందనే దానిపైనే ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారిస్తున్నాయి.దానికి తగ్గట్లే ప్రచారాన్ని సాగిస్తూ వస్తున్నాయి. పార్టీలతో పాటు వాటి అనుబంధ కార్మిక సంఘాలకు సింగరేణిలో గల బలంతో గట్టెక్కడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.  గత వైభవాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ తాపత్రాయపడుతుంటే..ఈసారి అయినా సింగరేణిని గులాబీ మయం చేయడానికి బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

తెలంగాణలో ఆరు జిల్లాల్లో సింగరేణి  విస్తరించి ఉంది.  ప్రత్యక్షంగా 11 అసెంబ్లీ స్థానాల్లో ,  పరోక్షంగా మరో మూడు అసెంబ్లీ స్థానాల్లో సింగరేణి ఓటర్లు నేతల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు గానూ.. మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుచుకోగా.. ఆరు స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. మిగతా రెండింటిని తెలుగు దేశం పార్టీ, ఆలిండియా ఫార్మర్డ్‌ బ్లాక్‌  గెలుచుకున్నాయి.

వీరిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధిగా  గెలిచిన తర్వాత ..ఒక్క మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తప్ప.. మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే అప్పుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వాళ్లే ఇప్పుడు  బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీలో నిలుస్తున్నారు. దీంతో  పార్టీ మారిన అభ్యర్థుల బలం గెలుస్తుందా? లేక పార్టీ బలం గెలుస్తుందా? అన్న దానిపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

2018లో జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులు..ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలుగా  కొనసాగుతున్నారు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన ఆత్రం సక్కు, రామగుండంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి గెలుపొంది. కోరుకంటి చందర్‌, భూపాలపల్లిలో అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి, కొత్తగూడెంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన  వనమా వెంకటేశ్వర్రావు, ఇల్లందులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన  బానోత్‌ హరిప్రియ, పినపాకలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన  రేగా కాంతారావు, సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య  బీఆర్‌ఎస్‌లోనే  కొనసాగుతున్నారు.

సింగరేణి ఆరు జిల్లాల్లో 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 3 బీఆర్‌ఎస్‌ స్థానాలు కూడా మంచిర్యాల జిల్లా నుంచే.. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల స్థానాలలో మాత్రమే  బీఆర్‌ఎస్‌ గెలిచింది.సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటీకరణ, కొత్త గనులు రాకపోవడం, సంస్థలో పెరిగిన పొలిటికల్ జోక్యం, సింగరేణికి  రూ.వేల కోట్లు ప్రభుత్వ సంస్థలు  బాకీ పడటం  వంటి సమస్యలను కాంగ్రెస్‌ ఏకరువు పెట్టి గత వైభవాన్ని కాపాడుకునేలా ప్రచారం చేస్తోంది. అయితే ప్రస్తుతం  నెలకొన్న తీవ్ర పోటీలో.. ప్రస్తుతం ఈ 11 స్థానాలు కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది . అందుకే  కార్మికులు ఇచ్చే తీర్పు ఇప్సుడు ఎంతో కీలకం కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 8 =