ప్రారంభమైన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని

Hyderabad Ministers Indrakaran Reddy and Talasani Offers Holy Clothes To Balkampet Yellamma Kalyanotsavam, Telangana Ministers Indrakaran Reddy and Talasani Offers Holy Clothes To Balkampet Yellamma Kalyanotsavam, Ministers Indrakaran Reddy and Talasani Offers Holy Clothes To Balkampet Yellamma Kalyanotsavam, Minister Talasani Offers Holy Clothes To Balkampet Yellamma Kalyanotsavam, Minister Indrakaran Reddy Offers Holy Clothes To Balkampet Yellamma Kalyanotsavam, Holy Clothes To Balkampet Yellamma Kalyanotsavam, Balkampet Yellamma Kalyanotsavam, Ministers Indrakaran Reddy and Talasani, Minister Indrakaran Reddy, Minister Talasani, Balkampet Yellamma Kalyanotsavam News, Balkampet Yellamma Kalyanotsavam Latest News, Balkampet Yellamma Kalyanotsavam Latest Updates, Balkampet Yellamma Kalyanotsavam Live Updates, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ లోని ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు కుటుంబ స‌మేతంగా అమ్మవారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. ఎల్లమ్మ ఆలయంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ మరియు ఇతర వ్యాధులను తొలగించి, ప్రజలు ఆయురారోగ్యాలతో దీవించాలని మంత్రులు అమ్మవారిని ప్రార్థించారు.

అలాగే మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కూడా ఇతర ప్రముఖులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. కాగా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆలయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇదే క్రమంలో  బోనాల ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రభుత్వం నగరంలోని దేవాలయాలకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here