నెహ్రూ జూలాజికల్ పార్క్ రేపటి నుంచే ఓపెన్

Hyderabad Nehru Zoological Park, Hyderabad Nehru Zoological Park to be Reopened, Hyderabad Unlock 5, Nehru Zoo Park, Nehru Zoo Park Reopen, Nehru Zoological Park, Nehru Zoological Park Hyderabad to reopens, Nehru Zoological Park to be Reopened, Zooa Park, Zoological Park to be Reopened

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ను అక్టోబర్ 6, మంగళవారం నుంచి సందర్శకుల కోసం తిరిగి తెరవనున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌-5 మార్గదర్శకాలకు అనుగుణంగా సంద‌ర్శ‌కుల‌ను జూలోకి అనుమతి ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు జూను సందర్శించకుండా ఉండాలని సూచించారు.

జూకి వచ్చే సందర్శకులందరూ మాస్క్ ధరించడం, ప్రవేశ సమయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అలాగే జలుబు లేదా జ్వరం లక్షణాలు ఉన్నవారిని అనుమతించరని చెప్పారు. టికెట్‌ కౌంటర్ల వద్ద భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశ ద్వారం, టికెట్ కౌంటర్లు మరియు మరుగుదొడ్లు వంటి కొన్ని ప్రదేశాల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేసున్నారు. ఇక జూ ప్రాంగణంలో ఉమ్మివేయడం, చెత్త వేయడాన్ని నిషేధిస్తూ, ఆ నిబంధనలు పాటించకపోతే రూ.1,000 జరిమానా విధించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు జూపార్క్‌ను మూసివేయగా, ఆరునెలల అనంతరం రేపు తిరిగి ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =