భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 74,442 పాజిటివ్ కేసులు నమోదవగా, 903 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 5, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 66,23,815 కు, మరణాల సంఖ్య 1,02,685 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 76,737 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 55,86,703 కు చేరుకుంది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 84.34 శాతం గానూ, మరణాల రేటు 1.55 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 9,34,427 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu