తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

First Year Exams Started Today Across the Telangana, Inter first-year exams commences smoothly, Intermediate first year exam commences in Telangana, Intermediate First Year Exams, Intermediate First Year Exams Started Today, Intermediate First Year Exams Started Today Across the Telangana, Mango News, telangana, telangana inter 1st year exams, Telangana inter exams, Telangana Intermediate first year exam schedule, TS Inter 1st Year Exam Time table, TS Inter Exams Time Table 2021

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 2020-21 బ్యాచ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతికి ప్రమోట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తాజాగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తునట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు జరిపేలా ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,769 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 4,59,228 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌, భౌతిక దూరం పాటించడం సహా ఇతర అన్ని కరోనా నిబంధనలను అమలు చేస్తున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here