పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు, ఇంటి వద్ద సైతం సంచారం: నాదెండ్ల మనోహర్

Janasena Leader Nadendla Manohar Says Unidentified Persons Suspicious Vehicles Following Pawan Kalyan's Movements,Suspicious Vehicles Following Pawan Kalyan, Vehicles Roaming At Home Too, Nadendla Manohar About Pawan Kalyan Security, Mango News, Mango News Telugu, Pawan Kalyan Security problems, Suspicious Vehicles Roaming At Pawan Kalyan Houses, Pawan Kalyan Janasena Party, Janasena Party Founder Pawan Kalyan, Janasena Chief Pawan Kalyan, Janasena President Pawan Kalyan, Nadendla Manohar Latest News And Updates, Janasenani Pawan Kalyan, Janasenani, JSP

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారని జనసేన నేత, పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. “ముఖ్యంగా విశాఖ సంఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారు. కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుసరిస్తున్నవారు అభిమానులు ఎంత మాత్రం కాదని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారు. వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు” అని తెలిపారు.

“ఈ రోజు అంటే, బుధవారం కారులోనూ, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారు. కాగా సోమవారం అర్దరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, పవన్ కళ్యాణ్ ను దుర్భాషలాడుతూ గొడవ చేశారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. అయినా సంయమనం పాటించిన సిబ్బంది, ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ కు అందించగా, ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు పిర్యాదు చేశారు” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలని జనసేన సైనికులు, వీరమహిళలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − fourteen =