టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్, ఖండించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

TDP Senior Leader Ex-Minister Ayyanna Patrudu Arrested by AP CID in Narsipatnam Today, TDP Senior Leader Ayyanna Patrudu, Ex-Minister Ayyanna Patrudu, Ayyanna Patrudu Arrested by AP CID,Mango News, Mango News Telugu,AP CID Arrested Ayyanna Patrudu, AP CID Arrested Ex-Minister Ayyanna Patrudu, AP CID Arrested Ayyanna Patrudu in Narsipatnam, Ayyanna Patrudu Latest News And Updates, AP CID, AP Crime Investement Department, TDP, YSR Congress Party

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయనను రాజమండ్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన పోలీసులు నోటీసులు ఇచ్చి ఆయనను అరెస్ట్ చేశారు. అయ్యన్నతో పాటు ఆయన చిన్న కుమారుడు చింతకాయల రాజేష్‌ను కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గత కొన్ని రోజుల క్రితం వారి ఇంటిగోడ కూల్చివేత వ్యవహారంలో కోర్టుకు ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. దీంతో సీఐడీ పోలీసులు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేసి సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపిసి సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అనంతరం ఏలూరు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐడీ పోలీసులు వెల్లడించారు.

ఇక అయ్యన్నపాత్రుడి అరెస్ట్ పై ఆయన సతీమణి పద్మావతి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు నర్సీపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా నోటీస్ ఇచ్చి అరెస్టు చేశారని, తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పారు. తన భర్తను దుస్తులు మార్చుకోనివ్వకుండా, కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వకుండా తోసుకుంటూ తీసుకువెళ్లారని తెలిపారు. అలాగే తన కుమారుడు స్వామి మాలలో ఉన్నాడని కూడా చూడకుండా అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు గానీ, తమ కుమారుడికి కానీ ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.

మరోవైపు అయ్యన్నపాత్రుడి అరెస్ట్ వ్యవహారంలో టీడీపీ పార్టీ మండిపడింది. టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతోందని విమర్శించారు. పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా అయ్యన అరెస్ట్ జరిగిన తీరుని ప్రశ్నించారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఉంది? అని ప్రశ్నించారు. అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో పాటు పలువురు టీడీపీ నేతలు అయ్యన్న అరెస్ట్‌ను ఖండించారు. కాగా అయ్యన్న అరెస్ట్ కావడంతో నర్సీపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసన చేపట్టిన టీడీపీ శ్రేణులు ఆయనను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు పట్టణంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + fifteen =