తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, COVID-19, Delhi Markaz Coronavirus, India COVID 19 Cases, Mahesh Babu, Mahesh Babu Thanks Telangana Police, Mahesh Babu Tweet On Telangana Police, Superstar Mahesh Babu, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Total COVID 19 Cases

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ను పూర్తీ స్థాయిలో అమలు చేయడం కోసం పోలీసులు విశ్రాంతి లేకుండా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నిర్విరామంగా పనిచేస్తోన్న పోలీసులను ఉద్దేశిస్తూ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ఈ రోజు ట్విటర్‌లో ఓ ట్వీట్‌ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న పోలీసులకు మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు.

‘కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేస్తున్నయుద్ధానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ పోలీసు బలగాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన సంక్షేమం కోసం నిర్విరామంగా వారు చేస్తున్న కృషి ఖచ్చితంగా అసాధారణమైనది. అత్యంత సవాల్ తో కూడుకున్నఈ క్లిష్ట పరిస్థితుల్లో మన జీవితాలతో పాటుగా, మన కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు వారికి నా కృతజ్ఞతలు. మనదేశం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ నిస్వార్థమైన అంకితభావానికి సెల్యూట్‌ చేస్తున్నాను’ అని మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here