తెలంగాణలో ఉద్యోగులకు శుభవార్త: పదోన్నతుల కోసం కనీససర్వీసు 2 ఏళ్లకు కుదింపు

Article 309, Employees Minimum Service for Promotions, Mango News Telugu, service rules of the high court, service rules of the high court for telangana, Telangana Employees Minimum Service, Telangana Free Home Isolation Kit by Telangana Govt, Telangana Govt, Telangana Govt Issued Orders on Employees Minimum Service, Telangana News, Telangana Political News

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం, వేతనాలు పెంపు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వంటి అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోన్నతుల(ప్రమోషన్ల) విషయంలో ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కనీస సర్వీసును మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సోమవారం నాడు సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు.

మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇటీవలే సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో సెక్రటెరియట్, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ (హెఛ్ఓడీఎస్) మరియు జిల్లా స్ధాయిలలో ఉద్యోగుల పదోన్నతులను జనవరి 31 లోగా పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను, హెఛ్ఓడీల ఉన్నతాధికారులను ఆదేశించారు. పదోన్నతలుతో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వలన వచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియమాల నోటిఫికేషన్లలో చేర్చాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =