ప‌ల్లె ప్రగతి హామీలు, ప్రభుత్వ పథకాల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స‌మీక్ష

Minister Errabelli Dayakar Rao Holds Review Meet on Progress of Govt Schemes Today, Telangana Minister Errabelli Dayakar Rao Holds Review Meet on Progress of Govt Schemes Today, Errabelli Dayakar Rao Holds Review Meet on Progress of Govt Schemes Today, Review Meeting on Progress of Govt Schemes Today, Review Meet on Progress of Govt Schemes Today, Progress of Govt Schemes, Telangana Minister Errabelli Dayakar Rao Hold Review Meet over Solar Power, Review Meet over Solar Power, Solar Power, Minister for Panchayat Raj and Rural Development, Errabelli Dayakar Rao Minister for Panchayat Raj, Errabelli Dayakar Rao Minister for Rural Development, Errabelli Dayakar Rao, Telangana Govt Schemes News, Telangana Govt Schemes Latest News, Telangana Govt Schemes Latest Updates, Telangana Govt Schemes Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌మీక్ష నిర్వహించారు. బుధవారం హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో ఆయా శాఖ‌ల‌ ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవ‌ల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప‌ల్లె ప్ర‌గ‌తి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఆయా సమస్యల పరిష్కార మార్గాల సాధ్యాసాధ్యాలపై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అధికారుల‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప‌ల్లె ప్ర‌గ‌తి హామీలు నెరవేర్చే కార్యక్రమాన్ని వెంట‌నే చేప‌ట్టాలని, గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల నిర్మాణాలు, గ్రామాలలో కొత్త సిసి రోడ్లు నిర్మాణం వంటివి త్వరగా చేపట్టాలని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను ఆదేశించారు. స్త్రీ నిధి రుణాల ద్వారా ఇంటింటికి సోలార్ ప్రాజెక్టు అందించే పథకానికి జిల్లాకు వెయ్యి మంది మ‌హిళా ల‌బ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అలాగే స్త్రీ నిధి వేత‌న పెంపు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాలని మంత్రి ఎర్ర‌బెల్లి ఆదేశించారు. ఈ స‌మీక్షా స‌మావేశానికి పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ హ‌న్మంత‌ రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లతో పాటు ఇత‌ర అధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =