జూన్ 27న శ్రీకాకుళంకు సీఎం జగన్, అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమంకు హాజరు

CM YS Jagan will Visit Srikakulam on June 27 Participate in Ammavodi 3rd Phase Funds Release Program, AP CM YS Jagan will Visit Srikakulam on June 27 Participate in Ammavodi 3rd Phase Funds Release Program, CM YS Jagan will Visit Srikakulam on June 27, AP CM YS Jagan Participate in Ammavodi 3rd Phase Funds Release Program, Ammavodi 3rd Phase Funds Release Program, CM YS Jagan will Visit Srikakulam, AP CM YS Jagan Mohan Reddy will Visit Srikakulam on June 27, YS Jagan Mohan Reddy will Visit Srikakulam, Ammavodi 3rd Phase Funds, AP CM YS Jagan Srikakulam Tour, CM YS Jagan Srikakulam Tour, AP CM YS Jagan Srikakulam Tour News, AP CM YS Jagan Srikakulam Tour Latest News, AP CM YS Jagan Srikakulam Tour Latest Updates, AP CM YS Jagan Srikakulam Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 27, సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని 1 వ తరగతి విద్యార్థుల నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకూ వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో అమ్మఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో జమ కాగా, మూడో విడత సాయాన్ని జూన్ 27న శ్రీకాకుళంలో జరిగే బహిరంగ సభ నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. కాగా 15 వేలల్లో పాఠశాలల మెయింటనెన్స్ కై 2 వేలు మినహాయించి, మిగిలిన 13 వేలను తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు కూడా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

మరోవైపు సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం సభా వేదిక, హెలిప్యాడ్ సహా ఇతర ఏర్పాట్లకై సీఎం కార్యక్రమాల కో-ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, ఎస్పీ రాధిక తదితరులు కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణాలను పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక శ్రీకాకుళంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యే అమ్మఒడి లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ సంభాషించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − five =