రెబెల్ ఎమ్మెల్యేలు కోరితే.. రాజీనామా చేసేందుకు నేను సిద్ధం – మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన

Maharashtra CM Uddhav Thackeray Announces If Any of Rebel MLA's Don’t Want Me I am Ready To Resign, CM Uddhav Thackeray Announces If Any of Rebel MLA's Don’t Want Me I am Ready To Resign, Uddhav Thackeray Announces If Any of Rebel MLA's Don’t Want Me I am Ready To Resign, Maharashtra CM Announces If Any of Rebel MLA's Don’t Want Me I am Ready To Resign, CM Uddhav Thackeray says he’s ready to quit as rebel MLAs don't want him, Uddhav Thackeray tells rebels MLAs Ready to resign from CM post, If Any of Rebel MLA's Don’t Want Me I am Ready To Resign Says Maharashtra CM Uddhav Thackeray, If Any of Rebel MLA's Don’t Want Me I am Ready To Resign, I am Ready To Resign, If Any of Rebel MLA's Don’t Want Me, Maharashtra CM Uddhav Thackeray, CM Uddhav Thackeray, Uddhav Thackeray, Maharashtra CM Uddhav Thackeray News, Maharashtra CM Uddhav Thackeray Latest News, Maharashtra CM Uddhav Thackeray Latest Updates, Maharashtra CM Uddhav Thackeray Live Updates, Mango News, Mango News Telugu,

దేశవ్యాప్తంగా ఉత్కంఠకు గురిచేస్తున్న మహారాష్ట్ర రాజకీయాలలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలలో ఎవరైనా నన్ను ముఖ్యమంత్రిగా వద్దనుకుంటే తక్షణం రాజీనామా చేసేందుకు నేను సిద్ధమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూటిగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు..

 • మీతో చెప్పాల్సింది చాలా ఉంది, ఈ రోజు చాలా ప్రశ్నలకు నేను సమాధానమిస్తాను.
 • నాకు ఈరోజు కరోనా పాజిటివ్‌ వచ్చింది, అయితే తీవ్ర లక్షణాలు లేవు.
 • శివసేన ఎప్పటికీ హిందుత్వ స్టాండ్‌నే తీసుకుంటుంది. హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి.
 • నేను ప్రజల్నికలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు, కానీ ప్రస్తుతం దేశంలో టాప్‌-5 ముఖ్యమంత్రులలో నేను ఒకడిననే విషయం మర్చిపోతున్నారు.
 • శివసేన వ్యవస్థాపకులు, మనందరికీ తండ్రిలాంటి వారైన బాలా సాహెబ్ బాల్‌ఠాక్రే వారసత్వాన్ని కొనసాగించేంది మేమే అని స్పష్టం చేయదలుచుకున్నాను.
 • గడచిన 25, 30 ఏళ్లుగా శివసేన కాంగ్రెస్‌, ఎన్సీపీలను వ్యతిరేకించింది. కానీ గత ఎన్నికల తర్వాత శరద్‌పవార్‌ స్వయంగా నన్నే సీఎం బాధ్యతలు స్వీకరించమని కోరారు.
 • బాధ్యతల్ని సవాల్‌గా స్వీకరించి పనిచేశాను, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నాకు పూర్తి సహకారం అందించాయి.
 • నా సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్‌ అయ్యాను, వారిలో ఎవరైనా నన్ను వద్దనుకుంటే సీఎంగా తప్పుకుంటా.
 • నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది, పార్టీ ఎమ్మెల్యేలలో ఎవరైనా దీనిని గవర్నర్‌కు సమర్పించవచ్చు.
 • ముఖ్యమంత్రి పదవినుంచి కాదు, శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
 • చర్చలకు రావాలని రెబల్‌ ఎమ్మెల్యేలను‌, ఏక్‌నాథ్‌ షిండేను ఆహ్వానిస్తున్నా.. నాతో షిండే నేరుగా మాట్లాడాలి.
 • ఒకవేళ ప్రభుత్వం కూలిపోయినా మళ్లీ ఎన్నికలకు వెళ్లి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం, శివసేనకు ఆ సత్తా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here