రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఫీవర్ సర్వే, వాక్సినేషన్ పై మంత్రి హరీశ్ రావు సమీక్ష

Corona Situation In Telangana, Door To Door Fever Survey, Fever Survey, Fever Survey and Vaccination in the state, Harish Rao Held Review on Corona, Harish Rao Held Review on Corona Vaccination, Harish Rao Held Review on Fever Survey, Mango News, Minister Harish Rao, Minister Harish Rao Held Review on Corona, Minister Harish Rao Held Review on Corona Fever Survey and Vaccination in the state, Review on Corona, Telangana Fever Survey

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఫీవర్ సర్వే, వాక్సినేషన్ అంశాలపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం నాడు వైద్యారోగ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఒకవైపు కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో పాటుగా మరో వైపు ఉన్న ఆసుపత్రులను ఆధునికీకరణ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా లేబర్ రూములు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఇతర అన్ని రకాల మరమ్మతులు చేపట్టి, వీటితో పాటు ఆధునీకరించనున్నాం. ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేసేందుకు కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుండటంతో పాటు, మరోవైపు ఉన్న ఆసుపత్రులను ఆధునికీకరించబోతున్నామని చెప్పారు.

తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతున్న ఫీవర్ సర్వే:

“ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా దవాఖానలు, ఏరియా హాస్పిటళ్ళు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యశాఖ మరమ్మతులు చేపట్టనున్నది. ఇందుకోసం రూ.10.84 కోట్లు వ్యయం చేయనున్నాం. 14 జిల్లాల పరిధిలోని 4 జిల్లా దవాఖానలు, 8 ఏరియా హాస్పిటళ్ళు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మరమ్మతులు చేపట్టబోతున్నాం. ఈ జాబితాలో నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఇక కరోనా కట్టడి కోసం మొదలుపెట్టిన ఫీవర్ సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 20 రక్త నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కటి రూ. 12లక్షల ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో వీటిని నెలకొల్పనున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 57 బ్లడ్ బ్యాంకులు ఉండగా 51 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నగరంలోని ఎంసిహెచ్ఆర్డిలో నిర్వహించిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, టిఎస్ఎంఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇంజనీర్లు, డీఎంఇ రమేష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =