ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ, ఐఏఎస్ ల నిబంధనల సవరణపై తీవ్ర అభ్యంతరం

CM KCR Writes a Letter to PM Modi, CM KCR Writes a Letter to PM Modi Expressed Strong Protest Against Proposed Amendments to IAS Rules, IAS transfers, IAS Transfers Telangana, KCR writes to Modi against IAS rule change, Latest News on AP IAS Transfers, Mango News, PM Modi Expressed Strong Protest Against Proposed Amendments to IAS Rules, PM Modi to drop proposed amendments to IAS cadre rules, Proposed changes in IAS rules, Telangana CM demands PM Modi to drop proposed amendments to IAS cadre rules, Telangana urges Centre to drop proposed changes to IAS Cadre Rules

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ఐఏఎస్ నిబంధనల సవరణ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అఖిల భారత సర్వీసు (కేడర్) రూల్స్, 1954కి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రతిపాదిత సవరణలు భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. నిబంధనల సవరణలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల డిప్యుటేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతికి ఒక నియమావళి ఉందని, అయితే కేంద్ర తాజాగా ప్రతిపాదించిన సవరణల ప్రకారం సంబంధిత అధికారులు లేదా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేకుండా అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకునే అధికారం కేంద్రం తీసుకుంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కేంద్రం నిర్ణయం రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్ మరియు సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్యగా ఉందని, ప్రతిపాదిత సవరణలను కేంద్రప్రభుత్వం అమలుచేస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాధారమైన సంస్థలుగా మారతాయని సీఎం కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖలు రాశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =