కేంద్ర మంత్రుల ద్వంద్వ వైఖరిపై మండిపడ్డ మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Slams Union Ministers Over Their Dual Stance on Telangana State, Minister Harish Rao Angry On Dual Attitude Of Union Ministers, Minister Harish Rao Slams Union Ministers, Minister Harish Rao Comments on Union Ministers, Mango News, Mango News Telugu, Telangana Minister Harish Rao, Telangana Minister Harish, Minister Harish Rao Latest News And Updates, Union Ministers Changing Words On Kaleshwaram, Harish Rao Slams FinMin Nirmala, Cabinet Ministers, Telangana Min Harish Rao slams Union Min, Union Ministers Changing Words On Kaleshwaram, Minister Harish Rao Twitter Live Updates

తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర మంత్రుల ద్వంద్వ వైఖరిపై రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని, మిషన్ భగీరథ పథకం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గత ప్రభుత్వాల హయాంలో బోర్‌వెల్‌ మరమ్మతులకే సర్పంచ్‌లు పరిమితమయ్యారని గుర్తు చేసిన మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రంలో తాగునీరు, సాగు నీరు కానీ, విద్యుత్‌ విషయంలో కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్ర మంత్రులు ఢిల్లీలో కొనియాడుతున్నారని, రాష్ట్రంలో మాత్రం విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఒకవైపు అవార్డులు ఇస్తూనే, మరోవైపు వాటిలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు ఆరోపించడం విడ్డూరంగా ఉందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అయితే కేంద్రం నుంచి మిషన్ భగీరథ పథకానికి సంబంధించి ఎలాంటి సహకారం లభించలేదని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా కేంద్రం పాటించలేదని హరీశ్‌ రావు అన్నారు. దేశంలో 50 శాతం ప్రజలకు ఇప్పటికీ సురక్షితమైన తాగునీరు అందడం లేదని, 100% తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 2014 వరకు కేవలం 5,600 కుటుంబాలకు నీరు అందితే.. ప్రస్తుతం 23,900 ఇళ్లకు రక్షిత మంచినీరు అందుతుందని ప్రకటించారు. పాదయాత్ర‌ చేస్తున్న నాయ‌కులకు తెలంగాణ ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని, ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ మోడల్ అభివృద్ధి వైపు చూస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − one =