ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabitha Indra Reddy Felicitated Topper Students Of Intermediate Results Declared Recently, Minister Sabitha Indra Reddy, Felicitated The Students , Secured The Highest Marks In Inter Results, Sabitha Indra Reddy Felicitated Students, Sabitha Indra Reddy Latest News And Updates, Mango News, Mango News Telugu, Minister Sabitha Indra Reddy Felicitated Students, Telangana Minister Sabitha Indra Reddy, Telangana Education Minister, Telangana Education Minister Sabitha Indra Reddy, Sabitha Indra Reddy Twitter Updates, Sabitha Indra Reddy Telangana Minister

ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువులు చెప్పిన విషయాలను అనుసరించి సమయాన్ని వృధా చేయకుండా చదివితే విజేతలుగా నిలుస్తారని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు నిరూపించారని మంత్రి అన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను గురువారం నాడు నగరంలోని ఎస్.సి.ఈ.అర్.టి.గోదావరి ఆడిటోరియంలో సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్యను అందించడం వల్లే ఉత్తమ ఫలితాలు లభిస్తున్నాయని, ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా పూర్తి స్థాయిలో విద్యార్థులకు సదుపాయాలను కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వార్షిక పరీక్షలకు ముందు నుండే సిద్ధం చేస్తున్నామని, అవసరమైతే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆదివాసి జిల్లాగా పేరున్న కొమురంభీమ్‌ ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం ప్రశంశనీయమని పేర్కొన్నారు. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రత్యేకంగా సైకాలజిస్టులతో సలహాలను ఇప్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఐఐటీ, నీట్‌ ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన శిక్షణ కూడా సత్పలితాలను సాధించిందని అన్నారు. పరీక్షలు సమీపించిన సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులను గ్రూప్‌లుగా విభజించి వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఓమర్ జలీల్, అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, లెక్చరర్లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =