తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ, పలువురికి అవార్డులు అందజేత

Actor cum MLA Nandamuri Balakrishna Participates His Father and TDP Founder NTR Centenary Celebrations at Tenali,Actor cum MLA Nandamuri Balakrishna,Balakrishna Participates NTR Centenary Celebrations,TDP Founder NTR Centenary Celebrations at Tenali,Mango News,Mango News Telugu,NTR Centenary Celebrations,Nandamuri Balakrishna Latest News,NTR Centenary Live News,TDP Founder NTR Centenary Latest Updates,Tenali News Today,Tenali NTR Centenary Celebrations News

కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం కల్పించిన తన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరుకావడం ఆనందంగా ఉందని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ, దివంగత ప్రముఖ నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మరియు తొలితరం అగ్ర నిర్మాతగా వెలుగొందిన బి. నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ రెడ్డిలకు ‘ఎన్టీఆర్’ పేరిట అవార్డులను అందజేశారు. ఇక తెనాలి ప్రాంతం ఎందరో కవులు, కళాకారులకు జన్మస్థలమని, ఇక్కడినుంచి వచ్చిన వారు తెలుగు చలన చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈరోజు పాతాళ భైరవి సినిమా విడుదలైన రోజని గుర్తు చేసిన బాలకృష్ణ.. తన తండ్రిగారి వలే తానూ కులాలకు అతీతమని, నందమూరి అభిమానులు తమ కుటుంబంలో భాగమని తెలిపారు. ఇక సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని, తనకు సినీ జన్మనిచ్చిన చెన్నై నగరానికి ‘తెలుగు గంగ’ ప్రాజెక్టు ద్వారా నీరు అందించారని వెల్లడించారు. నాగిరెడ్డి, సావిత్రి గార్లు కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, వారు చేసిన కృషి వల్లే ఇప్పటికీ గుర్తుండిపోయారని చెప్పారు. నటన అంటే సావిత్రి గారిలా సహజంగా ఉండాలని, ఆమె నటన అజరామరమని, అందుకే గొప్ప నటిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈరోజు ఈ వేదికపై ఆ మహానటి కుమార్తె చాముండేశ్వరికి ఎన్టీఆర్ అవార్డు అందించడం సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =