తెలంగాణలో జ్యూట్ పరిశ్రమలు ఏర్పాటు, మూడు కంపెనీలతో ఎంఓయూలు – మంత్రి కేటీఆర్

3 MoUs have been signed for setting up Jute mills, Jute Mills, Kamareddy, KTR Announce that 3 MoUs Signed for Setting up Jute Mills, Mango News, Minister KTR, Minister KTR Announce that 3 MoUs Signed for Setting up Jute Mills in Warangal, MOU Signing Ceremony for setting up 3 Major Modern Jute Mills, MoUs Signed for Setting up Jute Mills in Kamareddy, MoUs Signed for Setting up Jute Mills in Sircilla, MoUs Signed for Setting up Jute Mills in Warangal, Sircilla Districts, Telangana govt. signs 3 MoUs to set up Jute Mills, TS KTR

తెలంగాణ రాష్ట్రంలో జ్యూట్ పరిశ్రమలు పెట్టేందుకు మూడు కంపెనీలు ముందుకు వచ్చినట్టు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “వరంగల్, కామారెడ్డి మరియు సిరిసిల్ల జిల్లాల్లో జూట్ మిల్లుల ఏర్పాటుకు 3 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. మొత్తం 887 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కాబోయే ఈ జ్యూట్ పరిశ్రమలు ద్వారా 10 వేల మందికి పైగా ఉపాధి లభించనుంది. మద్దతు అందించిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ లకు ధన్యవాదాలు” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ముందుగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో జరిగిన అవగాహనా కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యూట్ పరిశ్రమలు ఏర్పాటుకు గ్లోస్టర్ లిమిటెడ్, కాళేశ్వరం అగ్రో లిమిటెడ్, ఎంబిజి కమాడిటిస్ లిమిటెడ్ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. గ్లోస్టర్ లిమిటెడ్ 330 కోట్లతో, కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ 254 కోట్లతో, ఎంబిజి కమాడిటిస్ లిమిటెడ్ 303 కోట్లతో వరసగా వరంగల్, కామారెడ్డి, సిరిసిల్లలో జ్యూట్ మిల్లులు ఏర్పాటు చేయనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nine =