ఆఖరి నిమిషంలో పాకిస్తాన్ తో సిరీస్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు

Government Security Alert, Mango News, New Zealand, New Zealand abandon cricket tour of Pakistan, New Zealand abandon Pakistan tour after security alert, New Zealand abandon tour of Pakistan citing security threat, New Zealand Abandoning Their Tour of Pakistan, New Zealand Abandoning Their Tour of Pakistan Following Government Security Alert, New Zealand abandons Pakistan cricket tour, New Zealand men abandon Pakistan tour, New Zealand pull out of Pakistan tour, New Zealand’s tour of Pakistan abandoned

పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లలో తలపడేలా షెడ్యూల్ విడుదల చేశారు. న్యూజిలాండ్‌ జట్టు ఇప్పటికే పాకిస్తాన్ చేరుకొని వన్డే, టీ20 సిరీస్ ల కోసం సన్నద్ధమైంది. అయితే సెప్టెంబర్ 17, శుక్రవారం మధ్యాహ్నం తొలి వన్డే ప్రారంభానికి ముందు న్యూజిలాండ్‌ కీలక ప్రకటన వెలువరించింది. ఈ టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని, పర్యటనను విరమించుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ ప్రకటన చేసింది.

న్యూజిలాండ్ ప్రభుత్వం జారీ చేసిన భద్రతా హెచ్చరికను అనుసరించి పాకిస్థాన్ పర్యటనను వదిలివేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి న్యూజిలాండ్ జట్టు నిష్క్రమణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ మాట్లాడుతూ, తనకు అందుతున్న సలహా మేరకు పర్యటనను కొనసాగించడం సాధ్యం కాదని అన్నారు. ఇది అద్భుతమైన హోస్ట్‌లుగా ఉన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఇబ్బందేనని, అయితే ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యం కావడంతో, ఇప్పుడు ఇదే బాధ్యతాయుతమైన నిర్ణయమని నమ్ముతున్నామని చెప్పాడు. అలాగే భద్రతా ముప్పు వివరాలు లేదా పాకిస్తాన్ నుంచి బయలుదేరే న్యూజిలాండ్ జట్టు కోసం చేయబడిన ఏర్పాట్లపై న్యూజిలాండ్ క్రికెట్ వ్యాఖ్యానించదని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 16 =