హైదరాబాద్ సిటీకి వాటర్ ప్లస్ గుర్తింపు, హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

Hyderabad City Gets Water Plus Status, Hyderabad City Gets Water Plus Status By Govt Of India, Hyderabad gets water plus certification, Hyderabad gets Water plus certification under Swachh Bharat, Hyderabad gets Water Plus tag, Hyderabad Rated Water Plus City, Mango News, Minister KTR Congratulates the Citizens, Water Plus Status By Govt Of India, Water Plus status under Swachh Bharat mission

హైదరాబాద్ మహానగరానికి మరో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం నుండి స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) యొక్క ప్రతిష్టాత్మకమైన “వాటర్ ప్లస్” హోదాను హైదరాబాద్ పొందింది. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందిన తోలి నగరంగా హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ నగరం ఈ హోదా పొందడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, హైదరాబాద్ పౌరులకు అభినందనలు తెలిపారు. అలాగే హైదరాబాద్ ఇప్పటికే ఓడీఎఫ్++ నగరంగా గుర్తింపు పొందిందని, హైదరాబాద్ ను మరింత పరిశుభ్రంగా, పచ్చదనంగా చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eight =