ప్రధాని ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణనే లేదు, తెలంగాణలో ఆ పార్టీ ఎందుకుండాలి? – మంత్రి కేటీఆర్

Minister KTR Criticizes Center for not Implementing AP Reorganisation Act Promises and Sanction of Other Projects,Minister KTR Criticizes Center for not Implementing AP,Center not Implementing AP Reorganisation Act,KTR on AP Sanction of Other Projects,AP Reorganisation Act Promises,Mango News,Mango News Telugu,Minister KTR Criticizes Center Latest News,Telangana News,Telangana Latest News And Updates,Telangana News Today,KTR Latest News,Minister KTR Latest Updates

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై వరుస ట్వీట్స్ తో ధ్వజమెత్తారు. తెలంగాణ‌ కు ఏదీ ఇచ్చేది లేద‌ని కేంద్రప్రభుత్వం చెప్తుందని అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించినందుకు తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలన్నారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్బాగ్యులను ఎన్నుకున్న ఫలితం ఇది అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ నిరాకరించబడుతుందని, కానీ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు రూ.20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ లభిస్తుందన్నారు.

తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం, పసుపు బోర్డు ఇవ్వం, మెట్రో రెండో దశ ఇవ్వం, ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం, గిరిజన యూనివర్సిటీ ఇవ్వం, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం అని ప్రధాని తేల్చేశారు. ప్రధాని మోదీ ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణే లేనప్పుడు, తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అలాంటపుడు తెలంగాణలో ఆ పార్టీ ఎందుకుండాలి? అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here