ఔషధాల ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Responds over Essential Medicines to Get Costlier by 12 Percent,Minister Harish Rao Responds over Essential Medicines,Harish Rao on Medicines to Get Costlier,Harish Rao on Medicines Costlier by 12 Percent,Mango News,Mango News Telugu,Minister Harish Rao Latest News,Telangana Latest News And Updates,Telangana News Today,Minister Harish Rao Latest Updates,Telangana Essential Medicines News Today

ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని, ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు అన్నారు. ఈ మేరకు సంబంధిత వివరాలను షేర్ చేస్తూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

“జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుంది. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైంది. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య. ఇదేనా బీజేపీ చెబుతున్న అమృత్ కాల్?, ఇవి అచ్చే దిన్ కాదు..సామాన్యుడు సచ్చే దిన్..దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + one =