ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప, ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?, కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు

Minister KTR Criticizes Central Govt over Special Packages to Oil Marketing Companies, Centre Not Doing Anything To Lower Fuel Prices, Ktr Demands Apology From Modi, Ktr Hits Back At Union Minister On Fuel Prices, Mango News, Mango News Telugu, Ktr Demands Centre To Lower Fuel Prices, Telangana Minister KTR , KTR Slams Centre For Fuel Prices, KT Rama Rao, PM Narendra Modi, Minister KTR Criticizes Central Govt, Oil Marketing Companies, Oil Marketing Companies Subsidiaries, Edible Oil Marketing Companies, Oil Marketing Companies Latest News And Live Updates

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఇటీవలే మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.22,000 కోట్లను ఒకేసారి మంజూరు చేయాలన్న కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం, ఆడబిడ్డలపై ఆర్థిక భారమా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశంలో, ఆదాయాలు పాతాళంలో ఉన్నాయన్నారు. “ఆయిల్ కంపెనీలకు కాసుల పంట, కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట. ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప, ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?, గరీబోల్ల గుండెలపై మోయలేని గుదిబండలు..ఈ గ్యాస్ బండలు” అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

“గ్యాస్ వెయ్యి అయ్యింది, పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యింది. పేదోడి పొట్టగొట్టడం, మళ్లీ చేతిలో పొగగొట్టం పెట్టడమే…సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి, ఇప్పుడు 3 సిలిండర్ల జపం చేస్తరా? మూడు సిలిండర్లతో మూడుపూటలా వంట సాధ్యమా? మహిళా లోకానికి అర్థమైంది, మోయలేని భారం మోపే వాడే, మోదీ” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే పేద మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ అవుతుందన్నారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి, కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా? అని ప్రశ్నించారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర, ఇప్పుడు రూ.1100 (నాటౌట్) గా ఉండి, ఇంక పెరుగుతూనే ఉందన్నారు. స్పెషల్ ప్యాకేజీలు ఆయిల్ కంపెనీలకు కాదని, ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =