తెలంగాణకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ కోటా పెంపుకు కేంద్రం నిర్ణయం

Union Govt Decided to Increase Oxygen, Remdesivir Injections Quota to Telangana,Mango News,Mango News Telugu,Centre Increases Oxygen Quota For Telangana,Centre Hikes Oxygen Supply,Remdesivir Injections To Telangana,Centre To Step Up Supply Of Oxygen,Medicines To Telangana,Centre Increases Oxygen Quota,Centre Hikes Oxygen And Vaccine Quota To Telangana,Centre Increases Telangana's Covid Essential Supplies,Centre Hikes Oxygen Supply And Remdesivir Injections To Telangana,Remdesivir Shortage,Remdesivir Medicine,Remdesivir Medicine In India,Coronavirus In Telangana,Covid Cases In Telangana,Covid-19 In Telangana,Coronavirus Telangana Cases,Covid-19 Cases,Covid-19 Cases Telangana,Coronavirus Pandemic,Coronavirus Telangana Update,Coronavirus Telangana Updates,Coronavirus Telangana

కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్ ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒరిస్సా లోని అంగుల్ నుంచి, పశ్చిమబెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి సీఎంను కోరారు. వ్యాక్సిన్లను కూడా పెద్దమొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ డోస్ కే ప్రాధాన్యతనిస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అందరికీ కరోనా వైద్యం అందించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి తలకుమించిన భారంగా మారే పరిస్థితి వుంటుందని, అందులో భాగంగా, కరోనా నియంత్రణకోసం ఆక్సిజన్, రెమిడెసివిర్, వ్యాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఆదేశాలు జారీచేసినట్టుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సీఎం కేసీఆర్ కు వివరించినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =