హైదరాబాద్ లోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Flagged Off The Indian Racing League On The Banks Of Hussain Sagar Today,Minister KTR Launched Indian Racing League,Indian Racing League At Hussain Sagar,Indian Racing League Hyderabad,Mango News,Mango News Telugu,Indian Racing League 2023,Indian Racing League Schedule,Indian Racing League Website,Indian Racing League Live Tv,Indian Racing League Hyderabad Live Stream,Formula E Hyderabad,Formula E Hyderabad Live,Formula E Race Latest News And Updates

హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్‌ (ఐఆర్ఎల్) ను శనివారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ రేసింగ్ లీగ్‌ను వీక్షించారు. 2.7 కిలోమీటర్ల పొడవైన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో అద్భుతమైన, ఆకట్టుకునే రేసును చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఈ పోటీలను చూసేందుకు వచ్చేవారికోసం రేసింగ్‌ ట్రాక్‌ పొడవునా 7వేల నుంచి 8వేల వరకు ప్రేక్షకులు వీక్షించేందుకు సీటింగ్‌ను ఏర్పాటు చేశారు.

ఐఆర్ఎల్ పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులు భారీగా హాజరైనా నేపథ్యంలో హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతంలో భారీగా సందడి నెలకుంది. నగరంలో నేడు, రేపు రెండు రోజుల పాటుగా ఐఆర్ఎల్ జరగనుంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ స్ట్రీట్‌ రేసింగ్‌ దేశంలోనే మొదటిసారి కావడం విశేషం. ఐఆర్ఎల్ ఫార్మాట్‌లో 6 జట్లు పోటీపడుతుండగా మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొంటున్నారు. ఐఆర్ఎల్ కోసం హుస్సేన్‌ సాగర్‌ తీరంలో హెచ్‌ఎండీఏ అన్ని ఏర్పాట్లు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − one =