మంథని సమీపంలో బ‌స్సు ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

TSRTC MD VC Sajjanar Expressed Shock over the Bus Incident Near Manthani,Mango News, One Died And Several Left Injured After TSRTC Bus Fell In Valley In Peddapalli, One killed as bus falls off road after collision with car, Peddapalli Accident, peddapalli news today live, Telangana, Telangana 1 dies 16 hurt after TSRTC bus falls into gorge, Telangana 1 dies 16 hurt after TSRTC bus falls into gorge in Peddapalli, TSRTC bus Accident Peddapalli, TSRTC bus falls into gorge in Peddapalli, TSRTC Bus Fell In Valley In Peddapalli

మంథని సమీపంలో కారు డ్రైవర్ అజాగ్రత్త మరియు అతి వేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడం వలన బస్సు లోయలో పడింది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పండగ సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం మరియు బాధాకరమని అన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యం వలన చిన్న గాయాలు అయినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలిగాడన్నారు. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు బాధ్యతగా వాహనాలు నడిపితే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావని వీసీ సజ్జనార్ సూచించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పై కేస్ నమోదు చేయడం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి మరియు గాయపడిన వారికి తన తరపున మరియు ఆర్టీసీ యాజమాన్యం తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

వాహనదారులు ఎవరైన రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించడం మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని, మన ప్రాణాలు మనకు ఎంత ముఖ్యమో ఇతర వాహనాదారుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని చెప్పారు. మనం చేసే తప్పువలన ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పాలవుతాయని గుర్తుంచుకోవాలన్నారు. వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తరఫున తెలియజేస్తున్నామని ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =