సిరిసిల్లలో దళితబంధు పథకం కింద మంజూరైన రైస్‌ మిల్‌ యూనిట్ రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా నిలవాలి – మంత్రి కేటీఆర్‌

Minister KTR Inaugurates Rice Mill Unit Which Sanctioned Under Dalit Bandhu Scheme in Rajanna Sircilla District,Minister KTR Inaugurates Rice Mill Unit,Rice Mill Sanctioned Under Dalit Bandhu Scheme,KTR Inaugurates Rice Mill in Rajanna Sircilla District,Mango News,Mango News Telugu,KTR Participating in Inauguration of Rice Mill,First Dalit Bandhu Rice Mill To Open,Dalit Badhu,Rice Mill with Dalit Band,Dalit Bandhu Beneficiaries Turn Entrepreneurs,Dalit Bandhu Scheme,Dalit Bandhu Scheme Latest News,Minister KTR Latest Updates

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు పథకం కింద మంజూరైన రైస్‌మిల్‌ యూనిట్‌ విజయవంతంగా నడిచి రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు మంత్రి కేటీ రామారావు. సోమవారం ఆయన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఈ రైస్‌మిల్‌ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులను రైస్ మిల్ యూనిట్ స్థాపన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం కింద అందిన ఆర్ధికసాయంతో రైస్‌మిల్‌ను స్థాపించాలనుకోవడం గొప్పనిర్ణయమని, ఇతర లబ్దిదారులకు ఇది ఒక కేస్‌ స్టడీగా మారాలని అభిలషించారు. ఇదే స్పూర్తితో దళితబంధు లబ్ధిదారులు వినూత్నంగా ఆలోచించాలని, స్వయం సమృద్ధితో పాటు నలుగురికి ఉపాధి కలిగేలా ఏదైనా ఒక గొప్ప పనిని ప్రారంభించాలని కేటీఆర్‌ సూచించారు.

ఇక ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సీఎం కేసీఆర్ కానీ ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని హితవు పలికారు. సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినోత్సంగా జరిపామని, అయితే దీనిని విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని కొందరు కుహనా మేథావులు ప్రశ్నిస్తున్నారని, అలాంటి వారు ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామో చెప్పాలని అన్నారు. త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం పౌరులుగా మన బాధ్యతని, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం మానుకుని దేశ భవిష్యత్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 16 =