శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానం ‘ప్రైమ్‌ ఎయిర్‌’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Launches Amazon Air Cargo Fleet Prime Air at Shamshabad Airport Today,Minister KTR Launches,Amazon Air Cargo Fleet,Prime Air at Shamshabad Airport,Mango News,Mango News Telugu,Prime Air Jobs,Prime Air India,Prime Air Flights,Prime Air Fleet,Prime Air Drones,Prime Air Drone,Prime Air Conditioning,Prime Air Cargo,Prime Air Careers,Prime Air Airplane,Amazon Prime Air Locations,Amazon Prime Air Jobs,Amazon Prime Air

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానం ‘ప్రైమ్‌ ఎయిర్‌’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్లోబల్ ఇ-కామర్స్ దిగ్గజం, అమెజాన్ తన సొంత ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రైమ్ ఎయిర్‌ను తెలంగాణలో ప్రారంభించడం సంతోషాన్నిస్తోందని, వారికి ఈ తరహా ప్రయత్నం దేశంలోనే ఇదే మొదటిదని తెలిపారు. అమెరికా, యూరప్ వెలుపల అమెజాన్‌ సంస్థకు ఉన్న ఏకైక అతిపెద్ద మార్కెట్ ఇదేనని, అలాగే దీనిద్వారా దేశంలో తన లాజిస్టికల్ ఉనికిని పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెజాన్‌ యొక్క అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లోనే ఉందని తెలిపిన మంత్రి, తాజాగా అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా రానున్న ఏడేళ్లలో రాష్ట్రంలో మొత్తం పెట్టుబడులు రూ.36,300 కోట్లకు పెంచబోతున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

శంషాబాద్‌ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌లలో ఒకటని, అలాగే హైదరాబాద్‌ గ్రీన్‌సిటీ అవార్డును కూడా సొంతం చేసుకుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో రెండో స్థానంలో నిలిచిందని, గడచిన ఏడేళ్లుగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. దీంతో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. కాగా ప్రైమ్ ఎయిర్ 2016లో తొలిసారిగా అమెరికాలో ప్రారంభించబడింది. ప్రస్తుతం రెండు బోయింగ్ 737-800లతో కార్గో సేవలు ప్రారంభమవుతుండగా, ఈ ఏడాది చివరి నాటికి వాటి సంఖ్యను ఆరుకు పెంచనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇక ప్రస్తుతం, ప్రైమ్ ఎయిర్ ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 737లు, 767లు మరియు ఏటీఆర్ లతో సహా 91 విమానాల సముదాయాన్ని నిర్వహిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 6 =