సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌, ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్, చిరంజీవి

Accused Pallakonda Raju Reported Dies by Suicide, Hyderabad girl rape and murder, Mango News, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Tweet Over Saidabad Accused Raju Suicide Incident, Minister KTR, Pallakonda Raju Reported Dies by Suicide, Saidabad, saidabad 6 years girl, Saidabad Accused Raju Suicide Incident, Saidabad horror, Saidabad Incident, Saidabad rape case, Saidabad rape-murder accused found dead on railway track, saidabad singareni colony news, Six-year-old girl allegedly raped, Tweet Over Saidabad Accused Raju Suicide Incident

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ హత్యాచార ఘటనలో నిందితుడు అయిన రాజు ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం స్టేష‌న్ ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్‌పై చనిపోయి కనిపించిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ తెలియజేశారని పేర్కొన్నారు.

అలాగే ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ, “అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు, పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి” అని పేర్కొన్నారు.

ముందుగా స్టేషన్ ఘన్ పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై మౌనిక అనే టాటూ, శరీరంపై గుర్తుల ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. కోణార్క్ రైలుకు ఎదురుగా వెళ్లి రాజు ఆత్మహత్య చేసుకున్న‌ట్లు ప్రత్యక్ష సాక్షులైన రైల్వే సిబ్బంది తెలిపారు. అనంతరం మృతదేహాన్ని చూసి 100కు డ‌య‌ల్ చేసి స‌మాచారం ఇచ్చినట్టు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలన చేశారు. అనంతరం నిందితుడు రాజు ఆత్మహత్యను ధృవీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ప్రకటన చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 2 =